ఏసీబీకి చిక్కిన శానిటరీ ఇన్​స్పెక్టర్ : పీర్జాదిగూడ

ఏసీబీకి చిక్కిన శానిటరీ ఇన్​స్పెక్టర్ : పీర్జాదిగూడ

మేడిపల్లి, వెలుగు :  లంచం తీసుకుంటూ శానిటరీ ఇన్​స్పెక్టర్ ఏసీబీకి రెడ్​హ్యాండెడ్​గా దొరికారు.  పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్​లో  శానిటరీ  కార్మికులకు అందించే సబ్బులు, నూనెలు, గ్లాసెస్, చెప్పులను సప్లయ్ చేసిన కాంట్రాక్టర్  ఎన్. శ్రీరాములుకు రూ.10 లక్షల చెక్కు రిలీజ్ అయింది. అదేవిధంగా కార్పొరేషన్​లోని వెహికల్స్ రిపేర్​కు రూ. 7, లక్షల 39 వేలు,  వెహికల్ పంక్చర్లకు రూ. 65 వేలు మొత్తంగా రూ.  8 లక్షల 4 వేలు పెండింగ్ బిల్లు రిలీజ్ చేయాల్సి ఉంది. ఇందుకు రూ. 10 లక్షల బిల్లుకు 5 శాతం చొప్పున 50 వేలు లంచంగా ఇవ్వాలని శానిటరీ ఇన్​స్పెక్టర్  కె. జానకి డిమాండ్ చేసింది.

దీంతో కాంట్రాక్టర్ శ్రీరాములు ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం మున్సిపల్ ఆఫీసులో బాధితుడి నుంచి ఔట్​ సోర్సింగ్ ఉద్యోగి అసిస్టెంట్ సరోజ డబ్బులను తీసుకుని శానిటరీ ఇన్ స్పెక్టర్ జానకికి రూ.20 వేలు ఇచ్చింది. వెంటనే ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకుని.. జానకి, సరోజను అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించారు.