- ముసారాంబాగ్ ఎక్స్ రోడ్లో ఘటన
మలక్ పేట, వెలుగు: డ్యూటీలో ఉన్న జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులపై దాడికి పాల్పడిన నలుగురు యువకులను మలక్ పేట పోలీసులు అరెస్ట్చేశారు. బల్దియా కామాటిగా పని చేస్తున్న కత్తుల యాదయ్య, శానిటరీ ఫీల్డ్అసిస్టెంట్శ్రీనివాస్ కలిసి ముసారాంబాగ్ ఎక్స్ రోడ్లో గురువారం ఉదయం చెత్త తీయడానికి వెళ్లారు.
అదే ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ చెందిన కొందరు యువకులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ అక్కడే ఉన్న హోటల్లో పని చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమంత్ భట్టాచార్య, సుమన దత్తా రోడ్డుపై చెత్త వేస్తుండడంతో చూసిన కత్తుల యాదయ్య రోడ్డుపై వేయవద్దని, డబ్బాలో వేయాలని చెప్పాడు. దీంతో వారు ఆగ్రహంతో యాదయ్యపై దాడి చేసి కొట్టారు.
దాడిని ఆపేందుకు వెళ్లిన ఎస్ఎఫ్ఏ శ్రీనివాస్ పై కూడా అటాక్చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు మలక్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన సోమంత్ భట్టాచార్య, సుమన్ దత్తాతో పాటు సహకరించిన శోభజిత్ షా..అబ్దుల్ రెహమాన్ ను అరెస్ట్ చేశారు.
