"పుట్టినరోజు శుభాకాంక్షలు, నాన్న"

"పుట్టినరోజు శుభాకాంక్షలు, నాన్న"

ఈ రోజు (జూన్ 6) ప్రముఖ నటుడు సునీల్ దత్ పుట్టినరోజు సందర్భంగా, అతని కుమారుడు, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఓ ఆసక్తికర పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మున్నా భాయ్ M.B.B.S చిత్రంలోని తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలిపే రెండు అద్భుతమైన చిత్రాలను షేర్ చేశారు. వీటితో పాటు “మీ నమ్మకం, ప్రేమే ఈ రోజు నేను ఈ స్థాయిలో నిలబెట్టాయి. నువ్వు ఎప్పటికీ ఉంటావు. నీవే నా హీరో. పుట్టినరోజు శుభాకాంక్షలు, నాన్న" అనే హార్ట్ టచింగ్ క్యాప్షన్ ను రాసుకొచ్చారు సంజయ్. దీని పక్కన ఒక లవ్ సింబల్ ఎమోజీని కూడా జత చేస్తూ తన తండ్రికి, సంజయ్ విషెస్ చెప్పారు. ఇటీవలే అతని తండ్రి వర్థంతి (మే 25) సందర్భంగా తన తండ్రితో ఉన్న పిక్ ను పోస్ట్ చేసిన సంజయ్... ఇప్పుడు అతని పుట్టినరోజున ఈ చిత్రాలు షేర్ చేయడం వైరల్ గా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

మరిన్ని వివరాల కోసం...

బైకర్ను ఢీకొట్టిన కారు యజమాని

కుక్కపై పోలీస్ కంప్లైట్