సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఏక్ నాథ్ షిండే లేఖ

సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఏక్ నాథ్ షిండే లేఖ

రెబల్ ఎమ్మెల్యేలు మహారాష్ట్రకు వచ్చి మాట్లాడాలని మరోసారి సూచించారు శివసేన నేత సంజయ్ రౌత్. వేరే చోట ఉండి మాట్లాడటం సరికాదన్నారు. సభలోకి వస్తే ఎవరికి ఎంత దమ్ముందో తెలుస్తుందన్నారు. తాను పూర్తి కాన్ఫిడెంట్ తో ఉన్నానని సంజయ్ రౌత్ చెప్పారు. రెబల్ క్యాంపులో ఉన్నవాళ్లు కూడా తమతో ఫోన్లు మాట్లాడారన్నారు. తమ దగ్గర ఎంత బలముందో తమకు తెలుసునన్నారు. వేలాది మంది కార్యకర్తలు  రక్తాన్ని ధారపోసి పార్టీని నిర్మించారన్నారు సంజయ్ రౌత్. అలాంటి పార్టీని డబ్బులతో కొనలేరన్నారు. పార్టీని అంత సులువుగా ఎవరూ హైజాక్ చేయలేరని, ఆ ఆలోచన కూడా చేయలేరన్నారు రౌత్. 

మరోవైపు.. సీఎం ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే. 38 మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి, డీజీపీకి కూడా ఆయన లేఖ రాశారు. తమ కుటుంబాలకు ఏమైనా జరిగితే రాష్ట్ర సర్కారుదే బాధ్యతన్నారు. భద్రత తొలగించడమంటే భయపెట్టడమేనన్నారు. సర్కారు తీరుతో తమ బంధువులు ఆందోళనలో ఉన్నారన్నారు.