విక్రాంత్, చాందిని చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్, నిర్వి హరి ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. నవంబర్ 14న సినిమా రిలీజ్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా హాజరైన డైరెక్టర్స్ బాబీ, సందీప్ రాజ్, శైలేష్ కొలను, బీవీఎస్ రవి, ప్రొడ్యూసర్స్ లగడపాటి శ్రీధర్, అప్పిరెడ్డి మంచి కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
విక్రాంత్ మాట్లాడుతూ ‘సంతాన సమస్యలను ఎమోషన్‌తో చూపిస్తూ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రతి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ నా క్యారెక్టర్‌తో రిలేట్ అవుతారు ’ అని చెప్పాడు. ఇప్పుడున్న సమాజంలో చెప్పాల్సిన కథ ఇదని చాందిని చౌదరి చెప్పింది. సంతాన లేమి సమస్యల గురించి ప్రతి ఒక్కరూ ఓపెన్‌గా చర్చించేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు సంజీవ్ రెడ్డి అన్నాడు. ఈ చిత్రంతో మంచి ప్రయత్నం చేశామని, ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న క్లీన్ ఫ్యామిలీ మూవీ ఇదని నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
