
జియోస్టార్ CEO సంజోగ్ గుప్తాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించారు. సోమవారం (జూలై 7) జై షా నేతృత్వంలో సంజోగ్ గుప్తాను ఐసీసీ కొత్త సీఈఓగా నియమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. జియోస్టార్‌లో CEO (స్పోర్ట్స్ అండ్ లైవ్ ఎక్స్‌పీరియన్స్)గా పనిచేస్తున్న గుప్తా తక్షణమే ఐసీసీ సీఈఓగా తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇక సీఈఓగా 25 దేశాల నుండి 2,500 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 12 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడ్డారని ఐసీసీ తెలిపింది.
"క్రీడా పాలక సంస్థలతో సంబంధం ఉన్న నాయకులతో పాటు వివిధ రంగాల నుండి సీనియర్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల వరకు అభ్యర్థులు ఉన్నారు" అని ఐసీసీ తెలిపింది. ఈ నామినేషన్లను ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా, ఇసిబి చైర్మన్ రిచర్డ్ థాంప్సన్, ఎస్ఎల్సి అధ్యక్షుడు షమ్మీ సిల్వా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాలతో కూడిన నామినేషన్ల కమిటీకి పంపారు. వీరు సంజోగ్ గుప్తాను ఐసీసీ సీఈఓగా సిఫార్సు చేయడం జరిగింది. ఆ తర్వాత ఐసీసీ చైర్మన్ జై షా ఆ సిఫార్సును ఆమోదించారు.
ALSO READ : ఎడ్జ్ బాస్టన్‌లో చారిత్రాత్మక విజయం.. దిగ్గజాలకు సాధ్యం కానిది చేసి చూపించిన గిల్
"క్రికెట్ తదుపరి దశకు తోడ్పడటానికి.. ఈ ఆటను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి.. ఐసీసీ సభ్యులతో కలిసి పని చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను". అని గుప్తా ఐసీసీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. గుప్తా జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి 2010లో స్టార్ ఇండియా (ఇప్పుడు జియోస్టార్)లో చేరారు. సంవత్సరాలుగా, ఆయన కంటెంట్, ప్రోగ్రామింగ్, వ్యూహంలో నాయకత్వ పాత్రలను పోషించి 2020లో డిస్నీ అండ్ స్టార్ ఇండియాలో స్పోర్ట్స్ హెడ్ అయ్యారు.
JioStar CEO Sanjog Gupta has been named as the ICC CEO. 🇮🇳 pic.twitter.com/fCG4gntafn
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2025