Sanju Samson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) క్లైమాక్స్ రేసులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులతో పాటు టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేసే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ మైదానంలో జరిగింది. మ్యాచ్ జరుగుతుండగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson) వేలికి తీవ్ర గాయమైంది.
అసలేం జరిగిందంటే?:
గుజరాత్ ఇన్నింగ్స్ 1.3 ఓవర్ దగ్గర స్పెన్సర్ జాన్సన్ గంటకు 144.5 కిలోమీటర్ల వేగంతో లెగ్ సైడ్ వైపు ఒక డెలివరీ వేశాడు. క్రీజులో ఉన్న సాయి సుదర్శన్ ఆ బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. కానీ, ఆ బాల్ బ్యాటర్‌ను దాటిన తర్వాత అనూహ్యంగా 'లేట్ స్వింగ్' (Late Swing) అవుతూ పక్కకు తిరిగింది. బంతిని ఆపడానికి సంజు శాంసన్ తన కుడివైపుకు కదిలినప్పటికీ, బంతి అంతకంటే వేగంగా అతని ఎడమచేతి వైపు దూసుకెళ్లింది.
►ALSO READ | SRH vs RCB మధ్య టఫ్ ఫైట్.. రేపు ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే!
సంజూ శాంసన్ చివరి నిమిషంలో బంతిని ఆపే క్రమంలో అతడి వేలి చివరన బాల్ బలంగా తగిలి, బౌండరీ వైపు దూసుకెళ్లింది.. బంతి వేలికి తాకగానే శాంసన్ తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, నొప్పి తగ్గకపోవడంతో సంజు రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీంతో శాంసన్ గాయపడి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడంతో, అతని స్థానంలో వికెట్ కీపర్‌గా ఊర్విల్ పటేల్ బాధ్యతలు చేపట్టాడు. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న చెన్నై జట్టుకు శాంసన్ గాయం తీవ్రమైనది కాకూడదని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.
🚨 BIG BLOW TO CSK
— Indian Cricket Ministry (@ICM_News45) May 21, 2026
Sanju Samson got injured while wicketkeeping after the ball hit the little finger of his left hand.
Urvil Patel is currently keeping wickets, while Sarfaraz Khan has come on the field as a substitute fielder.
Hopefully, the injury is not serious and Sanju… pic.twitter.com/mjjq6JEIun
