Sanju Samson: 21 మ్యాచ్‌ల్లో డకౌట్ కావాలి.. శాంసన్‌కు గంభీర్ ఇంత భరోసా ఇచ్చాడా

Sanju Samson: 21 మ్యాచ్‌ల్లో డకౌట్ కావాలి.. శాంసన్‌కు గంభీర్ ఇంత భరోసా ఇచ్చాడా

టీమిండియా ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ టీ20 ల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్ గా వచ్చినప్పటి నుంచి శాంసన్ ఓ రేంజ్ లో ఆడుతున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అలవోకగా సెంచరీలు బాదేస్తున్నాడు. వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్ కోసం తొలి వికెట్ కీపర్ గా పంత్ రేస్ లో ఉన్నాడు. ఓపెనర్ గానే సంజు జట్టులో కొనసాగనున్నాడు. 2026 ఫిబ్రవరి లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో ఆడడం దాదాపుగా ఖాయమైంది. టెస్ట్, వన్డే ఫార్మాట్ లో చోటు దక్కపోయినా టీ20ల్లో రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు. 

ఒకప్పుడు ఒకటి రెండు మ్యాచ్ ల్లో విఫలమైతే ఈ కేరళ స్టార్ క్రికెటర్ ను పక్కన పెట్టేవారు. కానీ ఇప్పుడు భారత టీ20 జట్టులో కీలక ప్లేయర్ గా మారాడు. ఒక వైపు ఓపెనర్ గా.. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. సంజు శాంసన్ ఇంత నిలకడగా రాణించడం వెనుక భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన భరోసా కనిపిస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్‌లో టీమిండియా వెటరన్ క్రికెటర్ రవి చంద్రన్ అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో గంభీర్ తనకు ఇచ్చిన భరోసా.. తనకు చెప్పిన ఇచ్చిన ధైర్యం గురించి చెప్పుకొచ్చాడు. 

సంజు శాంసన్ మాట్లాడుతూ.. " ఒకసారి గంభీర్ నా దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగాడు. దానికి నేను నాకు వచ్చిన అవకాశాలను పెద్ద స్కోర్లుగా మలచలేకపోతున్నాను అని గంభీర్ కు చెప్పాను. దానికి గంభీర్ నువ్వు వరుసగా 21 మ్యాచ్ ల్లో డకౌట్ అయినా జట్టు నుంచి తీసేయను అని సమాధానమిచ్చాడు. ఆ మాటలకు నాకు చాలా సంతోషాన్నిచ్చాయి. జట్టులో నా స్థానం సేఫ్ అని గుర్తించా. ఆ తర్వాత నుంచి గంభీర్ చెప్పిన మాటలతో నేను భారీ స్కోర్ చేయగలిగాను". అని శాంసన్ చెప్పాడు. 

సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ జట్టులో ఉండడానికి ఆసక్తి చూపించనట్టు సమాచారం. రాజస్థాన్ ఫ్రాంచైజీని విడుదల చేయాలని అధికారికంగా రిక్వెస్ట్ చేసినట్టు క్రిక్‌బజ్‌ కన్ఫర్మ్ చేసింది. గురువారం (ఆగస్టు 7) క్రిక్‌బజ్‌లో  నివేదిక ప్రకారం, సామ్సన్, రాజస్థాన్ రాయల్స్ కు మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని.. తనని వేలంలోకి పంపాల్సిందిగా సంజు కోరినట్టు తెలుస్తోంది. సామ్సన్ ఇకపై రాయల్స్‌తో కొనసాగాలని కోరుకోవడం లేదని అతని కుటుంబ సభ్యులు బహిరంగంగా చెబుతున్నారు. దీంతో సంజు ట్రేడింగ్ ద్వారా చెన్నై జట్టులోకి లేదా వేలంలోకి రానున్నాడు.