
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్రస్తుతం ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్నాడు. టీ20 క్రికెట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న శాంసన్ ఆసియా కప్ కు ఎంపికవ్వడమే కాదు తుది జట్టులో ఆడడం ఖాయంగా కనిపిస్తుంది. ఆసియా కప్ కోసం టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ లిస్ట్ లో శాంసన్ మొదటి వరుసలో ఉన్నాడు. రిషబ్ పంత్ గాయం కారణంగా ఆసియా కప్ కు దూరం కావడంతో సంజు ఇండియాకు వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అభిషేక్ శర్మతో పాటు ఓపెనర్ గా ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగనున్నాడు. ఈ కాంటినెంటల్ టోర్నీకి ముందు అశ్విన్‌తో జరిగిన యూ ట్యూబ్ చానెల్‌లో శాంసన్ క్రికెట్ లో తన డ్రీమ్ ను పంచుకున్నాడు.
ఇంటార్వ్యూలో భాగంగా అశ్విన్ నీ డ్రీమ్ అని అడిగాడు. అందుకు శాంసన్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా తరపున యువరాజ్ సింగ్ మాత్రమే ఆరు బాల్స్ కు ఆరు సిక్సర్లు కొట్టాడు. 2007 టీ20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పై ఒకే ఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టడం విశేషం. దేశవాళీ క్రికెట్ లో రవిశాస్త్రి, ఋతురాజ్ గైక్వాడ్ ఈ ఫీట్ సాధించారు. ఉప్పల్ వేదికగా గత ఏడాది బంగ్లాదేశ్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో సంజు శాంసన్ ఇన్నింగ్స్ 10 ఓవర్లో రిషద్ బౌలింగ్ లో సంజు వరుసగా 5 సిక్సర్లు బాది 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సంజు శాంసన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో దూసుకెళ్తున్నా ఐపీఎల్ కెరీర్ ను సందిగ్ధంలో పడేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉండడానికి ఆసక్తి చూపించనట్టు సమాచారం. రాజస్థాన్ ఫ్రాంచైజీని విడుదల చేయాలని అధికారికంగా రిక్వెస్ట్ చేసినట్టు క్రిక్‌బజ్ కన్ఫర్మ్ చేసింది. గురువారం (ఆగస్టు 7) క్రిక్‌బజ్‌లో నివేదిక ప్రకారం, సామ్సన్, రాజస్థాన్ రాయల్స్ కు మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని.. తనని వేలంలోకి పంపాల్సిందిగా సంజు కోరినట్టు తెలుస్తోంది. సామ్సన్ ఇకపై రాయల్స్‌తో కొనసాగాలని కోరుకోవడం లేదని అతని కుటుంబ సభ్యులు బహిరంగంగా చెబుతున్నారు. దీంతో సంజు ట్రేడింగ్ ద్వారా చెన్నై జట్టులోకి లేదా వేలంలోకి రానున్నాడు.
Sanju Samson said "My cricket dream is to hit 6 Sixes in an Over". [Ashwin YT] pic.twitter.com/5Ou5SmGc8y
— Johns. (@CricCrazyJohns) August 10, 2025