పట్నానికి పండుగ శోభ

పట్నానికి పండుగ శోభ

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్ లో సంక్రాంతి సంబురాలు ఆదివారం తెల్లవారు జామున భోగిమంటలతో షురూ అయ్యాయి. మూడు రోజులు జరిగే వేడుకల్లో సిటీవాసులు ఉత్సాహంగా ఇండ్ల ముందు ముగ్గులు వేసి రంగులతో అందంగా తీర్చిదిద్దగా.. కాలనీలు కళకళలాడాయి. నోములు నోచుకోవడం, పతంగులు ఎగురవేయడం, పిండి వంటలు సంక్రాంతి స్పెషల్.  కాగా.. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకర్షించాయి.

పరేడ్​ గ్రౌండ్స్​లో ఇంటర్నేషనల్ ​కైట్ ఫెస్టివల్ ​కూడా గ్రాండ్​గా కొనసాగుతుంది. ివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన ప్లేయర్స్​ ఫెస్ట్​లో పాల్గొని పతంగులు ఎగుర వేస్తున్నారు. మాదాపూర్​లోని శిల్పారామంలో  ప్రత్యేక ఏర్పాట్లు చేయగా సందర్శకులతో రద్దీగా మారింది. నెక్లెస్​ రోడ్​ పీపుల్స్​ప్లాజా వద్ద కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, బీజేపీ శ్రేణులు,​ బీఆర్ఎస్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ పాల్గొని పతంగులు ఎగురవేశారు. బేగంబజార్​లో నైట్​కైట్​ ఫెస్ట్ ​గ్రాండ్​ గా ప్రారంభమైం ది. డీజే మోతలకు స్టెప్పులతో  పండుగ జోష్ నెలకొంది. మరోవైపు.. పండుగకు జనాలు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన చౌరస్తాలు ఖాళీగా కనిపించాయి.