షాపింగ్ మాల్స్ లో గర్భిణుల కోసం.. స్పెషల్ పింక్ పార్కింగ్

షాపింగ్ మాల్స్ లో  గర్భిణుల కోసం.. స్పెషల్ పింక్ పార్కింగ్
  • బెంగళూరులోని ఓ మాల్‌‌లో ఏర్పాటు
  • నెట్టింట వైరల్​గా మారిన వీడియో

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని ఓ మాల్‌‌లో గర్భిణుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్​ సౌకర్యాన్ని కల్పించారు. దీనికి ‘స్పెషల్​ పింక్‌‌ పార్కింగ్’​ అని పేరు పెట్టారు. ఈ పార్కింగ్ ప్రదేశాన్ని సులభంగా గుర్తించేలా పింక్ రంగుతో అలంకరించి, ‘‘కాబోయే తల్లుల కోసం కేటాయించాం’’ అని రాసి ఉన్న బోర్డును ఏర్పాటు చేశారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను అక్షయ్​రైనా అనే ఓ యూజర్‌‌‌‌ షేర్​చేయగా.. నెట్టింట వైరల్​ అవుతున్నది.  ఈ కాన్సెప్ట్​ చాలా బాగుందని మాల్‌‌ నిర్వాహకులను నెటిజన్లు ప్రశంసించారు. ఇది గర్భిణులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, మిగతా మాల్స్‌‌లోనూ  ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.