పిండి వంటల తిప్పలు.. గిర్నీల ముందు క్యూ కట్టిన ప్రజలు

పిండి వంటల తిప్పలు.. గిర్నీల ముందు క్యూ కట్టిన ప్రజలు

సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తురావల్సింది కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, గొబ్బెమ్మలు కాదండోయ్.. ఘుమఘుమలాడే పిండివంటలు. ప్రతి ఇంటా వండించే సంప్రదాయ పిండివంటలు నోరూరిస్తూ సంక్రాంతి ప్రత్యేకతను తెలియజేస్తుంటాయి. ఇవి లేని సంక్రాంతిని ­ఊహించుకోవడమంటేనే చాలా కష్టం. నోరూరించే అరిసెలు, కొబ్బరి బూరెలు, నువ్వుల ఉండలు, కజ్జికాయలు, గారెలు జంతికలు, సున్నుండలు ఇలా బోలెడన్ని ఐటమ్స్.

పైన చెప్పిన తియ్యని పిండివంటలు పండగ పూట ఇంటిల్లపాదికి కొత్త కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. పిండివంటలకు అవసరమయ్యేపిండి కోసం ఆడ-మగ, పిల్ల-పెద్ద అనే తేడా లేకుండా అందరూ పొద్దున్నే గిర్నీల ముందు క్యూ కడుతున్నారు. దీంతో పిండి గిర్నీల షాపులన్నీ ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని మణికొండ, నార్సింగి, కొకపేట సహా చాలా ప్రాంతాల్లో ఈ రద్దీ కనిపిస్తోంది. షాపుల యజమానులు సైతం ఇదే మంచి అవకాశమానుకొని రేటు పెంచి నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు.