Sankranthi : ఆర్టీసీ బస్సులు ఫుల్.. అందినంతకు ప్రైవేటు దోపిడీ

Sankranthi : ఆర్టీసీ బస్సులు ఫుల్.. అందినంతకు ప్రైవేటు దోపిడీ

సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణ ప్రాంత ప్రజలకు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లతో పాటు,రైల్వే స్టేషన్లు సైతం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ లలో ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు ఫుల్ రష్ గా ఉంది. పండుగ సందర్భంగా ప్రభుత్వం అదనపు బస్సు సర్వీసులు అందుబాటులోకి తెచ్చినా బస్సుల కోసం గంటలకొద్దీ పడిగాపులు కాయాల్సివస్తుందని పబ్లిక్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సర్వీసులు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇదే అదనుగా చేసుకొన్ని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ అధిక ఛార్జీలతో ప్రజలను దోచుకుంటున్నారని ప్రయాణికుల చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు లేదా విజయవాడకు వెళ్లాలంటే మూడు వేలు ఛార్జీ వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇంట్లో ముగ్గురు, నలుగురు వెళితే.. ఇక నెల జీతం మొత్త బస్సు ఛార్జీలకే పెట్టాల్సిన పరిస్థితి వస్తోందని అంటున్నారు. పండుగ పూట ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని బస్సు ఛార్జీలను రెండుకు, మూడింతలు పెంచుతూ ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

స్పెషల్ బస్సులు వేశామని చెబుతున్నారు. కానీ మూడు గంటల నుంచి వెయిట్ చేస్తున్నా ఒక్క బస్సూ రావడం లేదు. మంత్రి అజయ్ కుమార్ ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మరో 100 బస్సులైనా అదనంగా వేయాలి. 

- ప్రయాణికుడు

ఈ సారి పండుగ సందర్భంగా అదనంగా 3వేల ఆర్టీసీ బస్సులను వేశారు. ముందుగానే రిజర్వేషన్ చేసుకునే వాళ్లకు 10శాతం రాయితీ కూడా ఇస్తున్నాం. ఈ ఏడాది  ప్రైవేటు కంటే ఆర్టీసీని ప్రజలు ఎక్కువ ఆదరించారు. ఆంధ్రా వాళ్లు కూడా ఆర్టీసీకే మొగ్గు చూపుతున్నారు. రద్దీ పెరుగుతున్న కొద్దీ సిటీ బస్సులను ఏర్పాటు చేస్తున్నాం.

- ఆర్టీసీ అధికారి