కొత్త సంవత్సరం ( 2026) లో పంచాంగం ప్రకారం అధికమాసం వచ్చింది. ఈ ఏడాది చాలా పండుగల తిథి రెండు రోజులు ఉండటంతో ఏ పండుగను ఏ రోజు జరుపుకోవాలనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు అలాగే హిందువులు జరుపుకొనే పెద్ద పండుగ సంక్రాంతి విషయంలో ఏ రోజు జరుపుకోవాలో క్లారిటీ లేకుండా పోయింది. సంక్రాంతి పండుగను ఏ రోజు జరుపుకోవాలి. పంచాంగం ప్రకారం ఎలా ఉంది. క్యాలెండర్ లో ఏముంది. .. పండితులు ఏం చెబుతున్నారు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
ఈ ఏడాది ( 2026) అధికమాసం కారణంగా సంక్రాంతి 14 అని కొందరు.. కాదు కాదు 15 అని మరికొందురు చెప్తున్నారు. జ్యోతిష్య పండితుల ప్రకారం ఈ ఏడాది ...
- జనవరి 14 బుధవారం : భోగి పండుగ
- జనవరి 15గురువారం : ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం, మకర సంక్రాంతి
- జనవరి 16 శుక్రవారం : కనుమ పండుగ
సంక్రాంతి మూడు రోజుల పండుగ. బోగీ, మకర సంక్రాంతి, కనుమ. ఈ మూడు రోజుల సంక్రాంతి పండుగల సందడి మామూలుగా ఉండదు.మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభక్షణం. దీనినే ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభంగా భావిస్తారు. సంక్రాంతితో ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. జూలై తరువాత దక్షిణాయణం ప్రారంభమవుతుంది. ఇందులో ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా పరిగణిస్తారు.
పుష్యమాసంలో వచ్చే ఈ పండుగ ఎంతో పవిత్రమైనదని, ఈ కాలంలో దానధర్మాలు, సూర్యారాధన చేస్తే శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయని పండితుల అభిప్రాయం. మకర సంక్రాంతి రోజున సూర్యనారాయణుడిని పూజించడం, నువ్వులతో చేసిన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆయుష్షు, ఆరోగ్యం, సంపద వృద్ధి చెందుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
