సనోఫీ జీసీసీ విస్తరణ... కొత్త ఆఫీసును ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

సనోఫీ జీసీసీ విస్తరణ... కొత్త ఆఫీసును ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బయోఫార్మా కంపెనీ సనోఫీ హెల్త్‌‌‌‌కేర్ ఇండియా హైదరాబాద్‌‌‌‌లోని తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను విస్తరించింది.  హైటెక్ సిటీలోని ప్రస్తుత క్యాంపస్‌‌‌‌లో 2.7 లక్షల చదరపు మీటర్ల వర్క్‌‌‌‌స్పేస్‌‌‌‌ను చేర్చింది.  ఉద్యోగుల సంఖ్యను  సుమారు 2,600 నుంచి 4,500కి పెంచుకుంది. ఈ కొత్త సెంటర్‌‌‌‌‌‌‌‌ను  తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు  ప్రారంభించారు.  

హైదరాబాద్  తయారీ కేంద్రం నుంచి గ్లోబల్ బయోఫార్మా ఇన్నోవేషన్ హబ్‌‌‌‌గా మారుతోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.    “ఏఐ, డేటా అనలిటిక్స్, మెడికల్ అఫైర్స్, ఎంటర్‌‌‌‌ప్రైజ్ ఆపరేషన్స్‌‌‌‌లో అనుభవంతో ‌‌‌‌ లైఫ్ సైన్సెస్‌‌‌‌లో మరింత విలువను  ఈ సెంటర్‌‌‌‌ క్రియేట్ చేస్తుంది.  

ప్రపంచ స్థాయి ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, పాలసీ స్థిరత్వం, ట్యాలెంట్ ఉన్నవారిని అందించడానికి తెలంగాణ కట్టుబడి ఉంది.  గ్లోబల్ కంపెనీలు ధైర్యంగా తమ కార్యకలాపాలను విస్తరించవచ్చు” అని పేర్కొన్నారు.