నవంబర్ 14న సంతాన ప్రాప్తిరస్తు రిలీజ్

నవంబర్ 14న  సంతాన ప్రాప్తిరస్తు రిలీజ్

సెన్సిబుల్ ఇష్యూపై ఓపెన్‌‌‌‌గా చర్చించేలా..

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా సాగే  క్యూట్ లవ్ స్టోరీనే  ‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రమని నిర్మాతలు  మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి అన్నారు.  విక్రాంత్, చాందిని చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి రూపొందించిన ఈ మూవీ నవంబర్ 14న  విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘సెన్సిబుల్ ఇష్యూను, సెన్సిటివ్‌‌‌‌గా చూపిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఈ సినిమాను ప్రారంభించాం.  

ఈ సినిమా చూశాక ఫెర్టిలిటీ ఇష్యూస్‌‌‌‌తో బాధపడుతున్న వారికి ఒక ధైర్యం వస్తుంది. మంచి మెసేజ్ చేరుతుంది.  మంచి లవ్ స్టోరీ, ఎమోషన్ ఉన్న క్లీన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్ మూవీ మాది. అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో అత్యధిక ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. మన సొసైటీలో ఉన్న ఈ సమస్య గురించి ఓపెన్‌‌‌‌గా మాట్లాడుకోవాలి.  ఇది సీక్రెట్‌‌‌‌గా చర్చించుకునే విషయం కాదు.   ఇందులోని కామెడీ  చాలా ఆర్గానిక్‌‌‌‌గా ఉంటుంది. విక్రాంత్‌‌‌‌, చాందినితోపాటు  వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్.. ఇలా కాస్టింగ్ అంతా ఆడియెన్స్‌‌‌‌ను  బాగా ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తారు.  ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తర్వాత ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ నేపథ్యంతో  ‘సంతాన ప్రాప్తిరస్తు  2’  చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం  ఆనంద్ దేవరకొండతో  ‘డ్యూయెట్’  సినిమా బ్యాలెన్స్  షూట్ కంప్లీట్ చేస్తున్నాం’ అని చెప్పారు.