ఘనంగా సంత్ సేవాలాల్ ​జయంతి

ఘనంగా సంత్ సేవాలాల్ ​జయంతి

హైదరాబాద్​సిటీ, వెలుగు: బడంగ్ పేట కార్పొరేషన్ 26వ డివిజన్ తిరుమల నగర్ లో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. సంత్​సేవాలాల్​మహరాజ్​ఫొటోకు నివాళులర్పించారు. ఆమెతోపాటు నాయకులు ఏనుగు రాంరెడ్డి, రామిడి రాంరెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రమేశ్ గౌడ్, గిరి ముదిరాజ్, బంజారా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.