పెద్ద హీరోలు ఇలాంటి చిత్రాల్లో నటించరు

పెద్ద హీరోలు ఇలాంటి చిత్రాల్లో నటించరు

ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్, ఎమోషన్‌‌‌‌తో పాటు మంచి మెసేజ్‌‌‌‌తో  ‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందని  హీరో  విక్రాంత్ అన్నాడు.  సంజీవ్ రెడ్డి దర్శక త్వంలో మధుర శ్రీధర్, నిర్వి హరి ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందు కొస్తోంది. ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ  ‘స్పెర్మ్  కౌంట్ తక్కువగా ఉండే హీరో కథ ఇది.  

మన తెలుగు ఆడియెన్స్‌‌‌‌కు నచ్చుతుందా అనే సందేహం ఉండేది. అయితే స్క్రిప్ట్ కంప్లీట్‌‌‌‌గా చదివాక ఎక్కడా అసభ్యత లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ చూసేలా సంజీవ్  కథను డెవలప్ చేశారు.  పెద్ద హీరోలు ఇలాంటి మూవీస్ చేయరు. వారికి ఇమేజ్ అడ్డు వస్తుంది. నాలాంటి కొత్త వాళ్లే ఇలాంటి డిఫరెంట్ ప్రయత్నాలు చేయాలి. ఇందులో  చైతన్య అనే సాఫ్ట్‌‌‌‌వేర్ ఎంప్లాయ్ రోల్ చేశాను.  

ప్రతి సాఫ్ట్‌‌‌‌వేర్ ఎంప్లాయ్ నా పాత్రతో రిలేట్ అవుతారు. చాందిని చౌదరి ఆకర్షణగా నిలుస్తుంది. డాక్టర్  బ్రమరం పాత్రలో వెన్నెల కిశోర్,  జాక్ రెడ్డి రోల్‌‌‌‌లో తరుణ్ భాస్కర్ అలరిస్తారు.  ఇన్ ఫెర్టిలిటీ అనే ఒక సెన్సిటివ్ ఇష్యూను తీసుకుని దానికి ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ యాడ్ చేశాం. సినిమా మూడొంతులు ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌ మెంట్‌‌‌‌తో సాగుతుంది.  చివరలో మంచి ఎమోషన్‌‌‌‌తో, మెసేజ్‌‌‌‌తో ఆడియెన్స్ థియేటర్స్ నుంచి బయటకు వెళ్తారు. రీసెంట్‌‌‌‌గా పలు చోట్ల వేసిన ప్రీమియర్స్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది’ అని చెప్పాడు.