
బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్(Sara ali khan) క్రికెటర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill)తో డేటింగ్లో ఉందంటూ కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ‘జర హట్కే జర బచ్కే’ సినిమాతో ఇటీవల సారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ప్రమోషన్స్‌లో క్రికెటర్ని పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్న ఈ బ్యూటీకి ఎదురైంది. దీనిపై స్పందిస్తూ.. తన జీవిత భాగస్వామిని కలుసుకున్నానో లేదో తనకే క్లారిటీ లేదంది. తాను ప్రేమించే వ్యక్తి ఏ ప్రొఫెషన్లో ఉన్నాడనేది తనకు మ్యాటర్ కాదని తెలిపింది.
‘అతడు సినిమా యాక్టరా, డాక్టరా లేదా క్రికెటరా అనేది నేను పట్టించుకోను. మా ఇద్దరి మానసిక స్థితి, పరిపక్వత మ్యాచ్ అయ్యిందా లేదా అనేది నాకు చాలా ముఖ్యం’ అంటూ సమాధానం ఇచ్చి అసలు విషయం దాటవేసింది. మొత్తానికి తన లైఫ్ పార్ట్నర్ క్రికెటర్ అయినా అభ్యంతరం లేదని హింట్ ఇచ్చింది. సారా నానమ్మ.. అలనాటి నటి షర్మిలా ఠాకూర్ సైతం క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీని పెళ్లాడారు.