లావుగా ఉందని కామెంట్.. మీరు అసలు జర్నలిస్టులేనా?.. బాడీ షేమింగ్పై సారా టెండూల్కర్ ఫైర్

లావుగా ఉందని కామెంట్.. మీరు అసలు జర్నలిస్టులేనా?.. బాడీ షేమింగ్పై సారా టెండూల్కర్ ఫైర్

Sara Tendulkar: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా కూల్‌గా, హుందాగా కనిపిస్తుంది. తాజాగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై పడే ఫొటోగ్రాఫర్లు (పాపరాజీల), బాడీ షేమింగ్ చేసే నెటిజన్ల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తనపై, తన వదినపై అత్యంత దారుణంగా, అసభ్యకరంగా కామెంట్లు చేసిన ఒక జర్నలిస్ట్‌ను టార్గెట్ చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షాకింగ్ పోస్ట్ పెట్టింది.

వివాదం ఎక్కడ మొదలైందంటే?: 
ఇటీవలే సారా టెండూల్కర్ తన వదిన (అర్జున్ టెండూల్కర్‌ భార్య)తో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. ఆ సమయంలో ఒక ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్ వారిద్దరినీ ఫాలో అవుతూ వీడియో తీశాడు. ఇక ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చాడు.. "మోతీ వాలీ సారా హై, బగల్ వాలీ భాభీ హై" (లావుగా ఉన్నది సారా, పక్కన ఉన్నది ఆమె వదిన) పేర్కొన్నాడు. 

సారా టెండూల్కర్ ఫైర్: 
ఈ కామెంట్‌ను చూసి సారా టెండూల్కర్ అస్సలు ఊరుకోలేదు. సదరు క్రియేటర్ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ, ఆ వివాదాస్పద వీడియో స్క్రీన్‌షాట్‌ను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. "మీరు చాలా అసహ్యకరంగా ప్రవర్తించారు.. దీనిని అస్సలు 'జర్నలిజం' అనరు.. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి (లీవ్ అస్ అలోన్) అంటూ సారా టెండూల్కర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.

►ALSO READ | అనిరుధ్‌తో SRH ఓనర్ కావ్య మారన్ సీక్రెట్ పెళ్లి? నెట్టింట జోరుగా ప్రచారం

పోస్ట్ డిలీట్ చేసినా వదలని సారా: 
సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తిట్టేసరికి, ఇంటర్నెట్‌లో తనపై వస్తున్న ట్రోలింగ్‌కు భయపడి ఆ క్రియేటర్ వెంటనే ఆ వీడియోను డిలీట్ చేశాడు. కానీ, డిలీట్ చేసినంత మాత్రాన చేసిన తప్పు పోదని సారా మరో స్టోరీ పెట్టింది. "నువ్వు నీ పోస్ట్‌ను డిలీట్ చేసి ఉండొచ్చు.. కానీ అంత మాత్రాన నీ చెత్త బుద్ధి ఏమాత్రం మారిపోదు" అంటూ డిజిటల్ బుల్లీయింగ్‌కు పాల్పడే వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది.

నెట్టింట సారాకు సపోర్ట్: 
సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ, కేవలం వ్యూస్ కోసం ఇలాంటి నీచమైన కామెంట్స్ చేసే పాపరాజీల (ఫొటోగ్రాఫర్లు) సంస్కృతిపై ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సారా ధైర్యంగా స్పందించిన తీరును సోషల్ మీడియా యూజర్లు, సినీ-క్రికెట్ సెలబ్రిటీలు ఎంతగానో అభినందిస్తున్నారు. వైరల్ క్లిక్స్ కోసం పరిధులు దాటే ఇలాంటి సోషల్ మీడియా జర్నలిస్టులపై కఠినమైన నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.