పురుషుల క్రికెట్‌లో మొదటి మ‌హిళా కోచ్‌ గా సారా టేల‌ర్

పురుషుల క్రికెట్‌లో మొదటి మ‌హిళా కోచ్‌ గా సారా టేల‌ర్

క్రికెట్‌లో పురుషులతో సమానంగా అత్యున్నత క్రికెటర్‌గా నిలిచింది ఇంగ్లాండ్ మాజీ మ‌హిళా క్రికెట‌ర్ సారా టేల‌ర్‌. లేటెస్టుగా ఆమె మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. ఇంగ్లాండ్‌లోని దేశ‌వాలీ జ‌ట్టైన సస్సెక్స్‌కు టేల‌ర్ వికెట్ కీపింగ్ కోచ్‌గా ప‌నిచేయ‌నుంది. చ‌రిత్ర‌లో తొలిసారి ఓ మ‌హిళా.. పురుషుల జ‌ట్టు కోచ్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది.
 
సస్సెక్స్‌లో టాలెంట్ వికెట్ కీపర్ల  టీం ఉంద‌ని.. వారితో క‌లిసి ప‌నిచేసేందుకు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపింది  సారా.  తన ఎక్స్ పీరియన్స్, నైపుణ్యాలను వారితో షేర్ చేసుకుని సహకారం అందిస్తానని చెప్పింది. వికెట్‌ కీపింగ్‌లోని ప్రాథమిక సూత్రాలపై ఎక్కువగా దృష్టి సారించి ఆటగాళ్లకు మెళుకువలు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించ‌నున్న‌ట్లు తెలిపింది సారా టేల‌ర్‌.