‘సారంగపాణి జాతకం’ నుంచి నీ సంబరం నీలాంబరం సాంగ్ రిలీజ్

‘సారంగపాణి జాతకం’ నుంచి నీ సంబరం నీలాంబరం సాంగ్ రిలీజ్

ప్రియదర్శి, రూప కడువయూర్ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సారంగపాణి జాతకం’.  శ్రీదేవి మూవీస్ బ్యానర్‌‌‌‌పై  శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. శనివారం ఫస్ట్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ‘సారంగో సారంగా..  అమ్మాయి అవునంది ఏకంగా’ అంటూ సాగిన పాటలో ప్రియదర్శి, రూప స్టైలిష్ లుక్‌‌లో ఇంప్రెస్ చేశారు. 

‘ఉల్లా ఉల్లా ఉల్లా ఉల్లాస కల్లోలం..  గల్లా గల్లా గంతులాడింది భూగోళం.. నీ సంబరం నీలాంబరం.. మేఘాల అంచుల్లో నుంచో బెట్టిందే మెళ్ళోన దండేసి ఛత్రం పట్టిందే..’ అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. వివేక్ సాగర్ సాంగ్ కంపోజ్ చేయగా, అర్మాన్ మాలిక్ ఎనర్జిటిక్‌‌గా పాడాడు. వెన్నెల కిశోర్, వైవా హర్ష, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది.