VHT 2025-26: 15 బంతుల్లోనే సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ.. విజయ్ హజారే చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్

VHT 2025-26: 15 బంతుల్లోనే సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ.. విజయ్ హజారే చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్

టీమిండియా టెస్ట్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తనలోని విశ్వ రూపాన్ని బయటపెట్టాడు. తనను టెస్ట్ క్రికెటర్ గా చూసే వారికందరికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. వన్డే ఫార్మాట్ లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఆల్ టైం రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. గురువారం (జనవరి 8) పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సర్ఫరాజ్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఓవరాల్ గా 20 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. 

విజయ్ హజారే ట్రోఫీలో 15 బంతుల్లో హాఫ్ సెంచరీ ఆల్ టైం రికార్డ్ కావడం విశేషం. అంతకముందు ఈ రికార్డ్ బరోడాకు చెందిన అథీత్ సేథ్ పేరిట ఉంది. అథీత్ 2020-21 సీజన్ లో ఛత్తీస్ ఘడ్ పై 16 బంతుల్లో ఈ ఘనత సాధించగా.. తాజాగా సర్ఫరాజ్ ఈ రికార్డ్ బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు. 2026 ఐపీఎల్‌‌ మినీ వేలంలో సర్ఫరాజ్ ను చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ దక్కించుకుంది. తొలి రౌండ్‌‌ వేలంలో సర్ఫరాజ్‌‌ను ఎవరూ తీసుకోలేదు. కానీ రెండో రౌండ్‌‌లో సీఎస్కే అతన్ని బేస్‌‌ప్రైస్‌‌ రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. 

ALSO READ : అప్పుడు వరల్డ్ కప్ హీరో.. ఇప్పుడు రియల్ హీరో.. 

2023లో చివరిసారి సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ తరఫున ఐపీఎల్‌‌ మ్యాచ్‌‌ ఆడిన సర్ఫరాజ్‌‌ను తర్వాతి రెండు సీజన్లలో ఎవరూ తీసుకోలేదు. డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లో మెరుగైన పెర్ఫామెన్స్‌‌ చేసినా.. టీమిండియాకు ఎంపిక కాలేదు. దాంతో అతని ఇంటర్నేషనల్​ కెరీర్‌‌ గందరగోళంలో పడింది. గత ఐపీఎల్‌‌ ఎడిషన్లలో సర్ఫరాజ్‌‌ బెంగళూరు, పంజాబ్‌‌, ఢిల్లీకి ఆడాడు. ఇక టీమిండియా తరఫున ఆరు టెస్ట్‌‌లు ఆడిన సర్ఫరాజ్‌‌ 37.10 సగటుతో 371 రన్స్‌‌ చేశాడు.  

ALSO READ : ఆల్ రౌండర్ కాదు అంతకుమించి

ఈ మ్యాచ్ విషయానికి వస్తే సర్ఫరాజ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ముంబైపై పంజాబ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ముంబై బౌలర్ల ధాటికి కేవలం 216 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ముంబై 215 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (62), శ్రేయాస్ అయ్యర్ (45) తప్ప మిగిలిన వారు విఫలమయ్యారు.