చిప్స్‌‌ పాకెట్‌‌తో చీర 

చిప్స్‌‌ పాకెట్‌‌తో చీర 

బట్టలు కట్టుకోవడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్‌‌ ఉంటుంది. చాలామంది ట్రెండీగా కనిపించడానికి రకరకాల డ్రెస్సింగ్ స్టైల్స్‌‌ను ఫాలో అవుతుంటారు. కొందరు ట్రెడిషనల్‌‌ వేర్‌‌‌‌ వేసుకుంటే ఇంకొందరు మోడర్న్‌‌  డ్రెస్‌‌లు వేసుకుంటారు. కాని ఈ అమ్మాయి అలా కాదు. చాలా డిఫరెంట్. 

సోషల్‌‌ మీడియా వల్ల కొత్తగా ఎవరేం చేసినా బాగా ట్రెండ్ అవుతుంది. అలానే ఈమె చేసిన పని కూడా ట్రెండ్‌‌ అయింది. ఇంతకీ ఈమె ఏం చేసిందంటే... నచ్చిన డ్రెస్‌‌ కొనుక్కొని వేసుకోవడం వేరు... స్వయంగా తయారు చేసుకోవడం వేరు అనుకుంది. అందుకే కాబోలు చిప్స్‌‌ కవర్స్‌‌తో తయారు చేసుకున్న చీర కట్టుకుంది. లేస్‌‌ పొటాటో చిప్స్‌‌ కవర్స్‌‌ను దాచుకొని వాటితో ఒక చీరను తయారు చేసుకుంది. దాన్ని కట్టుకొని స్టిల్స్‌‌ ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్‌‌ మీడియాలో బాగా వైరల్‌‌ అయింది. బెబాదాస్‌‌.ఇన్‌‌ అనే ఇన్‌‌స్టాగ్రామ్‌‌ పేజ్‌‌లో ఈ వీడియోను పోస్ట్‌‌ చేసారు. ఈ వీడియోలో మొదట ఒక అమ్మాయి చేతిలో ఒక బ్లూ కలర్‌‌‌‌ లేస్‌‌ ప్యాకెట్‌‌తో కనిపిస్తుంది. తరువాత మాయమై లేస్ ప్యాకెట్‌‌ కవర్స్‌‌తో చేసిన చీర కట్టుకొని కనిపిస్తుంది. సిల్వర్‌‌ కలర్‌‌‌‌లో బ్లూ కలర్‌‌‌‌ అంచుతో ఉన్న ఆ చీర వీడియోకు ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 6,086 లైక్స్‌‌ వచ్చాయి. కింద క్యాప్షన్‌‌లో ‘ఫర్‌‌‌‌ ద లవ్ ఆఫ్ బ్లూ లేస్‌‌ అండ్ శారీ’ అని రాసి ట్యాగ్‌‌ చేసింది. ఇది ఇలా ఉంటే చాలామంది నెటిజన్స్‌‌ ఆ వీడియో కింద ‘చీరను భలే డిజైన్‌‌ చేసావు’ అని కామెంట్స్‌‌ పెడితే, మరికొందరేమో ‘ట్రెండ్ అంటూ సంప్రదాయాలను పాడు చేస్తున్నారు’ అని విమర్శించారు.