సర్కారు వారి పాట నుండి 'మురారివా' సాంగ్..

సర్కారు వారి పాట నుండి 'మురారివా' సాంగ్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మూవీ ఇటీవలే ప్రక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ హైలేట్ గా నిలిచింది. అన్ని పాటలు ఎంతో అకట్టుకున్నాయి.. అందులో 'కళావతి' .. 'మ మ మహేశా' సాంగ్స్ ట్రెంగ్ లో నిలిచాయి. 

ఇక మూవీలో 'మురారివా' అనే పాటను అనుకోని కారణాల వల్ల సినిమాలో పెట్టలేదు. అయితే మూవీ రిలీజైన తర్వాత కొద్ది రోజులకు ఈ పాటను యాడ్ చేశారు. తాజాగా ఈ సాంగ్ ను  యూ ట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర బృందం. 'మురారివా.. మురారివా.. మురళీ వాయిస్తూ ముడేస్తివా' అంటూ ఈ సాంగ్ అకట్టుకుంటోంది.మహేశ్, కీర్తిలపై బ్యూటిఫుల్ సెట్లో ఈ పాటను ఎంతో అందంగా షూట్ చేశారు.