
పోటీ ప్రపంచంలో రాణించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచుకోవాలన్నారు డా. బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ కరస్పాండెంట్ సరోజా వివేక్. ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాల కోసం కాకుండా , ఉద్యోగాలు కల్పించే ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదగాలని కోరారు.
హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని అంబేద్కర్ కాలేజ్ సెమినార్ హల్ లో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు జరిగిన ఒరియంటేషన్ ప్రోగ్రాంలో కాలేజ్ సీఈవో లింబాద్రి , ఫ్రొఫెసర్ శ్రీరాములు , ఉపాదృష్ట సుబ్బారావులతో కలిసి పాల్గొన్నారు సరోజా వివేక్. ఈ సందర్భంగా.. డా.అంబేద్కర్ , కాకా వెంకటస్వామి (కాకా) చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు .
ఈ సందర్బంగా మాట్లాడిన సీఈవో డాక్టర్ లింబాద్రి.. డా. బీఆర్ అంబేద్కర్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్స్ రాష్ట్రంలోనే అత్యుత్తమమైన ఇన్‌స్టిట్యూషన్ అని అన్నారు. విద్యార్థులు ఇటువంటి కాలేజీని ఎంబీఏ కోర్స్ కోసం ఎంచుకోవడం అభినందనీయమని తెలిపారు. ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. కోర్సుతో పాటు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు అప్డేట్ కావాలని సూచించారు. కాకా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్సిస్ట్యూషన్స్ లాభాపేక్ష లేకుండా , నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని కొనియాడారు.