అగ్రికల్చర్ ల్యాండ్ లే అవుట్ అనుమతికి లంచం : ACBకి చిక్కిన అధికారులు

అగ్రికల్చర్ ల్యాండ్ లే అవుట్ అనుమతికి లంచం : ACBకి చిక్కిన అధికారులు

రంగారెడ్డి జిల్లా : మహేశ్వరం ఎంపీడీఓ కార్యాలయం, మంచాల పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒకేసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒకే కేసులో ఏడున్నర లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు అధికారులు.  భూమి లే అవుట్ పర్మిషన్ కోసం లంచం తీసుకుంటూ రెడ్ హ్యడెండ్ గా పట్టుబడ్డాడు ఎంపిఓ సిహెచ్ అధికారి శ్రీనివాస్. రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు శ్రీనివాస్.

అలాగే మాహేశ్వరం ఎంపీడీఓ కార్యాలయంలో, మాన్సాన్ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. ఐదున్నర ఎకరాల భూమి లే అవుట్ అనుమతి ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేశారు అధికారులు. ఇదే కేసులో ఐదున్నర లక్షలు తీసుకుంటూ.. దొరికారు పంచాయతీ సెక్రటరీ గీత, సర్పంచ్ భర్త రమేష్, ఉప సర్పంచ్ లు. వీరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.