బైక్ టైర్లో చీర కొంగు చిక్కుకొని మహిళ మృతి

బైక్ టైర్లో చీర కొంగు చిక్కుకొని మహిళ మృతి

బాల్కొండ, వెలుగు: చీర కొంగు బైక్  టైర్ లో చిక్కుకొని మహిళ చనిపోయింది. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్(బి)గ్రామానికి చెందిన గుండోజీ దేవిదాస్  భార్య, పిల్లలతో మెండోరా మండలం బుస్సా పూర్ లో ఉంటున్నాడు.

మంగళవారం దేవిదాస్  తన భార్య కమలతో కలిసి బైక్ పై నిర్మల్  వెళ్తుండగా, దూదిగాం గ్రామ శివారులో ఆమె చీర కొంగు టైర్ లో చిక్కుకొని కింద పడిపోయింది. తలకు తీవ్రగాయాలు కావడంతో నిర్మల్  ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.