
- వీకేసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తిరుమావలవన్
- ఘనంగా ట్రేడ్ యూనియన్ లీడర్సత్తయ్య పదవీ విరమణ సభ
రామచంద్రాపురం, వెలుగు: అంబేద్కర్, ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వీకేసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, తమిళనాడు ఎంపీ డాక్టర్ తిరుమావలవన్ అన్నారు. మను ధర్మాన్ని పాటించడమంటే నిమ్న వర్గాలను అణచి వేయడమేనన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో ట్రేడ్ యూనియన్ నాయకుడు కొల్లూరి సత్తయ్య పదవీ విరమణ సభ జరిగింది. ఎంపీ తిరుమావలవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సత్తయ్య జీవిత చరిత్రపై ప్రముఖ రచయిత పసునూరి రవీందర్రాసిన ‘మట్టి వేధావి’ అనే పుస్తకాన్ని ప్రొఫెసర్ కంచె ఐలయ్యతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం తిరుమావలవన్ మాట్లాడుతూ.. దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి పెద్దలు చూపిన పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. కొల్లూరి సత్తయ్య ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడారు.