సుమధుర ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెరా రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది : టీఎస్ రెరా

సుమధుర ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెరా రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది : టీఎస్ రెరా
  • ఇష్యూ చేసిన నోటీసులను వెనక్కి తీసుకున్న టీఎస్ రెరా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  షోకాజ్ నోటీసులపై సుమధుర ఇన్​ఫ్రాకాన్​  ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన టీఎస్​ రెరా తాజాగా నోటీసులు విత్​డ్రా చేసుకుంది. రెరా రిజిస్ట్రేషన్​ లేకుండానే ఈ కంపెనీ  ఫ్లాట్స్ అమ్ముతున్నట్టు ఓ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో యాడ్స్‌‌‌‌ రావడంతో  సుమధుర ఇన్‌‌‌‌ఫ్రాకాన్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌కు టీఎస్‌‌‌‌ రెరా షోకాజ్‌‌‌‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కంపెనీ​ ఇచ్చిన  వివరణను పరిశీలించి, ఫ్యాక్ట్స్ చెక్ చేశాక ఇష్యూ చేసిన నోటీసులను విత్‌‌‌‌డ్రా చేసుకుంటున్నామని టీఎస్​ రెరా వెల్లడించింది.   

‘సుమధుర ఇన్‌‌‌‌ఫ్రాకాన్‌‌‌‌కు చెందిన ప్రాజెక్ట్  ‘‘సుమధుర గార్డెన్స్‌‌‌‌ బై ది బ్రూక్‌‌‌‌’’ లో ఫ్లాట్స్ అమ్మకానికి ఉన్నాయని చెబుతూ ఓ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో యాడ్స్ వచ్చాయి. ఈ యాడ్​లో రెరా రిజిస్ట్రేషన్​ నెంబర్​ను ఉదహరించలేదు. ఫలితంగా కంపెనీపై  ఎందుకు పెనాల్టీ వెయ్యకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇష్యూ చేశాం’ అని టీఎస్‌‌‌‌ రెరా పేర్కొంది.  ‘హైదరాబాద్‌‌‌‌లో చేపడుతున్న మా అన్ని ప్రాజెక్ట్‌‌‌‌లకు రెరా అప్రూవల్స్‌‌‌‌ ఉన్నాయి. రెరా పేర్కొన్న అన్ని రూల్స్‌‌‌‌ను ఫాలో అవుతున్నాం. 

తరచూ అన్ని రిటర్న్‌‌‌‌లను ఫైల్ చేస్తున్నాం. రెరా రిజిస్ట్రేషన్ నెంబర్‌‌‌‌‌‌‌‌తోనే అన్ని యాడ్స్ ఇస్తున్నాం. రెరా నోటీసులు ఇచ్చిన ప్రాజెక్ట్‌‌‌‌ పై కొన్ని థర్డ్ పార్టీ రియల్ ఎస్టేట్‌‌‌‌ ఏజెన్సీలు  వెబ్‌‌‌‌సైట్లలో అడ్వర్టయిజ్ చేశాయి. ఈ విషయం తమకు తెలియదు’ అని   సుమధుర ఇన్‌‌‌‌ఫ్రాకాన్‌‌‌‌ వివరణ ఇచ్చిందని టీఎస్ రెరా పేర్కొంది.