రేవంత్​రెడ్డి నిప్పు రవ్వ : సతీష్ మాదిగ

రేవంత్​రెడ్డి నిప్పు రవ్వ : సతీష్ మాదిగ

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీశ్ రావు ఇంటిపై వెయ్యి చెప్పులు, డప్పులతో దాడి చేస్తామని కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ వార్నింగ్​ఇచ్చారు. బీఆర్ఎస్​హయాంలో దోచుకున్న అవినీతి సొమ్ము ఎక్కడ దాచుకోవాలో తెలియక బినామీలను తయారు చేసుకున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్ లో సతీష్ మీడియాతో మాట్లాడుతూ ‘రేవంత్ రెడ్డిది కోటీశ్వరుల కుటుంబం. ఆయన ఓ నిప్పు రవ్వ. హరీశ్ రావు రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్రపోతున్న అంటుండు. నీకు నిద్రపోవడానికి ఆయనకు జాగా లేదా? ముఖ్యమంత్రి  ప్రజల గుండెల్లో ఉన్నారు. తెలంగాణ రాకముందు తిరగడానికి హరీశ్​రావుకు చెప్పుల్లేవు. కేటీఆర్ హోటల్ లో చిప్పలు కడిగిండు. కవిత అమెరికాలో బ్యూటీ పార్లర్ నడిపింది. తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎంత? ఇప్పుడు మీ ఆస్తులు ఎంత. లంబు, జంబులాగా రాష్ట్రాన్ని దోచుకున్నరు’ అని మండిపడ్డారు.

ALSO READ | తెలంగాణను మరో బీహార్‎గా మార్చేందుకు కుట్ర: హరీష్ రావు