
నవతరం హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని ముందుకు వెళుతున్నాడు ‘సత్యదేవ్’. ఆయన నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. మెగాస్టార్ ‘చిరంజీవి’ నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీలో ఈయన కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న 26 సినిమాకు సంబంధించి పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఎరుపు రంగు థీమ్‌లో గుర్రం చూపిస్తూ.. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫొటోను అధికారికంగా విడుదల చేశారు.
క్రైమ్, యాక్షన్ జానర్ లో మల్టీస్టారర్ గా సినిమా రూపొందుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో ప్రముఖ నటుడు కీలక రోల్ పోషించనున్నారని సమాచారం. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకు చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. ఓల్డ్ టౌన్ పిక్చర్ పై బాల సుందరం, దినేష్ సుందరంలు నిర్మిస్తున్నారు. ‘గుర్తుందా శీతాకాలం, రామ్ సేతు, ఫుల్ బాటిల్’ అనే మూవీల్లో నటిస్తున్నాడు.