సత్యసాయి సేవా సంస్థ: ఫైనాన్స్ గ్రాడ్యుయేట్లకు ఉచిత ఉపాధి శిక్షణ..

సత్యసాయి సేవా సంస్థ: ఫైనాన్స్ గ్రాడ్యుయేట్లకు ఉచిత ఉపాధి శిక్షణ..

హైదరాబాద్​, వెలుగు: కామర్స్, ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ల కోసం సత్యసాయి సేవా సంస్థలు ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఎంబీఏ ఫైనాన్స్, ఎం.కామ్ పూర్తి చేసిన వారు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. శిక్షణ తరగతులు వచ్చే నెల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమవుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు 9052372023 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 

కార్పొరేట్ అకౌంటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ మెలకువలను ఇందులో నేర్పిస్తారు. ప్రస్తుతం సీఏ లేదా సీఎంఏ చదువుతున్న వారు ఈ కోర్సుకు అర్హులు. గతంలో 100 కన్నా ఎక్కువ మందికి శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించామని సంస్థ తెలిపింది.