12 రోజుల్లో 17 మందికి ఉరిశిక్ష.. సౌదీ ప్రభుత్వం ప్రకటన

12 రోజుల్లో 17 మందికి ఉరిశిక్ష.. సౌదీ ప్రభుత్వం ప్రకటన

సౌదీ అరేబియాలో తప్పుచేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తోంది. రానున్న 12 రోజుల్లో 17 మంది నేరస్తులకు బహిరంగంగా ఉరిశిక్షను అమలు చేయనున్నట్లు యూఎన్ అధికార ప్రతినిధి ఎలిజబెత్ త్రోసెల్ అధికారికంగా ప్రకటించారు. వీరంతా మాదకద్రవ్యాల కేసులో దోషులుగా ఉన్నారని తెలిపారు. సౌదీలో ఎలాంటి నేరం చేసినా ఉరిశిక్ష వేయడం ఎన్నో ఏళ్ల నుంచి అమలులో ఉంది. అత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాలకు పాల్పడి దోషులుగా రుజువైతే వారికి బహిరంగంగా మరణశిక్ష విధిస్తారు. 

తాజాగా మరణ శిక్ష విధించిన వారిలో నలుగురు సిరియా, ముగ్గురు పాకిస్థాన్, ముగ్గురు జోర్ధాన్‌, ఏడుగురు సౌదీకి చెందిన వారు ఉన్నారని త్రోసెల్ తెలిపారు. సౌదీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో వివిధ నేరాల్లో దోషులుగా తేలిన 81 మందికి మరణశిక్షను అమలు చేసింది. అది కూడా ఒక్కరోజులోనే వీరందరికీ శిక్ష వేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 144 మందికి సౌదీ ప్రభుత్వం బహిరంగంగా మరణశిక్ష వేసింది.