మక్కా: కరోనాని కంట్రోల్ చేయడానికి సౌదీ అరేబియా చాలా ప్రయత్నిస్తోంది. 24 గంటలూ కర్ఫ్యూ విధించినా వైరస్ ఆగడంలేదు. ముస్లిం ల పవిత్ర నగరమైన మక్కాలో కరోనా వ్యాపించిన ట్లుగా గుర్తించారు. ఈ సిటీ చుట్టుపక్కల కిక్కిరి సిన మురికివాడలు, లేబర్ క్యాంపులు ఉండడం వల్లనే వైరస్ అదుపులోకి రావడం లేదని భావిస్తున్నారు. మక్కాలో 20 లక్షల జనాభా ఉండగా, వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని రియాద్లో 1,422 వరకు కేసులు బయటపడ్డాయి. మక్కా లో ఇమ్మిగ్రెంట్లు, వలస కార్మికుల నివాస ప్రాంతాలు ఎక్కువ. దాంతో ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సౌదీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పడుతోంది. మార్చి నెలాఖరులో మక్కాలో కరోనా కేసు నమోదైంది. సౌదీలోని అతి పెద్ద
కన్స్ట్ర క్షన్ కంపెనీల్లో ఒకటైన సౌదీ బిన్ లదిన్ గ్రూపులోని అయిదుగురికి పరీక్షలు చేయగా, వారికి పాజిటివ్ వచ్చింది. దాంతో మక్కాలో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ గ్రూప్ మక్కాలోని పవిత్ర కాబా ప్రాంతాన్ని విస్తరించే పనులు చేస్తోంది. దీనికోసం సుమారుగా 8,000 మంది కార్మికులు అక్కడే నివాసం ఏర్పరచుకుని పని చేస్తున్నారు. కరోనా వైరస్ కేసులు బయట పడడంతో కొందరిని హొటళ్లలో క్వారంటైన్ చేశారని బ్లూమ్ బెర్గ్ దీనిపై వివరాలు చెప్పడానికి కన్స్ట్ర క్షన్ కంపెనీ నిరాకరించింది.
మక్కాని మూసేయడం కుదరదు
కరోనా మహమ్మారి సోకిన ఇతర దేశాల మాదిరిగా మక్కాకి పూర్తిగారాకపోకలు నిషేధిం చడమనేది సౌదీకి కుదరదు. ప్రపంచ ముస్లిం లం దరికీ అతి పవిత్రమైనది మక్కా నగరం. మక్కా పవిత్రతను కాపాడుతూనే, వైరస్నిఅరికట్టాల్సి న బాధ్యత సౌదీ రాయల్ ఫ్యామిలీపై ఉంది. మొత్తం మూడు కోట్లజనాభాగల దేశంలో 5,000 వరకు కేసులు బయటపడ్డాయి. సౌదీ ఫిబ్రవరి నుంచే మక్కా యాత్రను నిలిపివేసింది. దేశంలోనిఅన్ని మసీదుల్ని మార్చిలో మూసేసింది.
మీరే అంటిస్తున్నారు: విదేశీయులపై ఆరోపణలు
సౌదీ జనాభాలో మూడోవంతు బయటి దేశాల కార్మికులు ఉంటారు. కొత్తగా బయటపడ్డకేసుల్లో దాదాపు 75 శాతం వీళకు ్ల సంబంధించినవేనని హెల్త్ మినిస్ట్రీ చెబుతోంది. ఇప్పటికే విదేశీయు లంటే లోకల్ సౌదీలకు చాలా కడుపు మంటగా ఉంటుంది. వాళవల్ల ్లనే తమకు అవకాశాలు పోతున్నాయన్నది వాళ్లవాదన. కరోనా కేసులు బయటపడేసరికి ఫారినర్స్పై దాడులకు దిగు తున్నారు. ‘మీరంటేనే మాకు గిట్టదు. మీవల్లే ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కావాలనే మాకు కరోనా వైరస్ అంటిస్తున్నారు’ అని తిట్టి పోస్తున్నారు.
