సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్): చెస్ ఒలింపియాడ్‌లో ఇండియా విమెన్స్ డ్రాతో గట్టెక్కింది. గురువారం కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను ఇండియా 2–2తో డ్రా చేసుకుంది. దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి గేమ్‌లు డ్రా కాగా, అలువా నూర్మన్‌తో జరిగిన గేమ్‌లో ఆర్. వైశాలి ఓటమిపాలైంది.
దాంతో కీలకమైన చివరి గేమ్‌ను సవిత డ్రా చేసుకుని ఇండియాను ఆదుకుంది. ప్రస్తుతం చైనా, కజకిస్తాన్ చెరో 13 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, ఇండియా 12.5 పాయింట్లతో ఉంది. ఓపెన్ విభాగంలో ఇండియా మెన్స్ 2–2తో అజర్‌బైజాన్‌తో జరిగే మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ప్రస్తుతం ఇండియా ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి.
