సమంతకు 'ఐ లవ్ యూ' చెప్పడానికి నిరాకరించిన రాజ్ నిడిమోరు.. 'మా ఇంటి బంగారం' ఈవెంట్‌లో క్రేజీ సీన్

సమంతకు 'ఐ లవ్ యూ' చెప్పడానికి నిరాకరించిన రాజ్ నిడిమోరు.. 'మా ఇంటి బంగారం' ఈవెంట్‌లో క్రేజీ సీన్

టాలీవుడ్ నటి సమంత లీడ్ రోల్‌లో లేటెస్ట్ గా నటించిన  'మా ఇంటి బంగారం'. భారీ అంచనాల మధ్య జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో  ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకురాలు నందినీ రెడ్డి, ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరు, నిర్మాత హిమాంక్ దువ్వూరు తదితరులు పాల్గొన్నారు. అయితే, ఈ ఈవెంట్‌లో జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

సమంతకు 'ఐ లవ్ యూ'..

స్టేజ్ పైకి స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు రాగానే ఫ్యాన్స్ అరుపులు పీక్స్‌కి చేరాయి. ఆ గోలలో ఫ్యాన్స్ ఏం అంటున్నారో సరిగ్గా వినబడట్లేదని రాజ్ అనగా.. వెంటనే యాంకర్ సుమ తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు. అభిమానులు సమంతకు మిమ్మల్ని ఓసారి 'ఐ లవ్ యూ' చెప్పమని అడుగుతున్నారు అని సుమ అనగానే ఆడిటోరియంలో చప్పట్లు మార్మోగాయి. దీనికి రాజ్ నిడిమోరు స్పందిస్తూ.. ఇప్పటికే స్టేజ్ మీద చాలామంది ఆమెకు ఆ మాట చేప్పేశారు. కింద ఉన్న ఫ్యాన్స్ కూడా అదే అరుస్తున్నారు. ఇక ఇందులో కొత్తగా నేను చెప్పాల్సింది ఏముంది? అంటూ చిరునవ్వుతో తప్పించుకున్నారు.

 అటు సమంత నటనను రాజ్ ఆకాశానికెత్తేశారు. సమంతను ప్రతిసారీ ఒక కొత్త సీన్‌తో టెస్ట్ చేస్తే, నేను ఊహించని రేంజ్‌లో అవుట్‌పుట్ ఇస్తుంది. ఒక నటిగా తనతో పని చేయడం ఎప్పుడూ ఎక్సైటింగ్‌గా ఉంటుంది అని మెచ్చుకున్నారు. ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే మధ్యలో సమంత సరదాగా కలుగజేసుకుని తెలుగులోనే మాట్లాడొచ్చు కదా అని కౌంటర్ వేయడం అక్కడున్న వారిని కడుపుబ్బా నవ్వించింది.

రిలీజ్‌కు ముందే ప్రాఫిట్!

ఒక పక్క ఈవెంట్ క్రేజ్ ఇలా ఉంటే..  సినిమా బిజినెస్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ, రైట్స్ కోసం బయ్యర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.  థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ అన్నీ భారీ ధరకు అమ్ముడైపోయాయని, సినిమా రిలీజ్‌కు ముందే పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వచ్చేసిందని నిర్మాత హిమాంక్ దువ్వూరు సగర్వంగా ప్రకటించారు. మా బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ కథను, సమంత పవర్‌హౌస్ పెర్ఫార్మెన్స్‌ను బలంగా నమ్మింది. దానికి కమర్షియల్‌గా వస్తున్న ఈ బజ్ మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు చూపిన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటాం అని ఆయన పేర్కొన్నారు.

ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. 2 గంటల 34 నిమిషాల 30 సెకన్ల రన్‌టైమ్‌తో థియేటర్లలో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి 'మా ఇంటి బంగారం' సిద్ధమైంది. జూన్ 19న బాక్సాఫీస్ దగ్గర సమంత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.