TG T20 టోర్నమెంట్పై వివాదం.. హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

TG T20 టోర్నమెంట్పై వివాదం.. హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

హైదరాబాద్: నటుడు విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుపాటి, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, క్రికెటర్లు సిరాజ్, తిలక్ వర్మలకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు పంపింది. HCA నిర్వహిస్తున్న TG 20 టోర్నమెంట్కి పర్మిషన్ లేదని TCA స్పష్టం చేసింది. TG 20 టోర్నమెంట్కి ఎండార్స్మెంట్ చేసేముందు, ఆ టోర్నమెంట్కి పర్మిషన్ ఉందో.. లేదో తెలుసుకోవాలని TCA జనరల్ సెక్రటరీ సూచించారు.

లేకుంటే ఫ్యూచర్లో లీగల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. టోర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసే 45 రోజుల ముందు BCCI నుంచి అనుమతి తీసుకోవాలని, సుప్రీం కోర్టు నిబంధనలు పాటించకుండా టోర్నమెంట్ నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని తెలిపారు.

అప్రూవల్ లేని టోర్నమెంట్లో తిలక్ వర్మ, సిరాజ్లు ఆడమని BCCI పర్మిషన్ ఇచ్చిందా? ఎండార్స్మెంట్ చేసేముందు ఈ టోర్నమెంట్ లీగలా.. కాదా అనేది చూసుకోవాలని చెప్పారు. ఖమ్మం టీమ్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొడుకుకు ఏం సంబంధమని ప్రశ్నించారు.

►ALSO READ | ఒకే ఓవర్లో రెండు సెంచరీలు.. ఆఫ్ఘన్ బౌలర్లను చీల్చి చెండాడిన గిల్, ఇషాన్ 

వరంగల్ టీంలో జూపల్లి కృష్ణారావు కొడుకుకి ఏం సంబంధం అని తెలిపారు. HCA నిర్వహిస్తున్న TG 20 ఫ్రాడ్ టోర్నమెంట్ అని, HCA లీగల్ ఫీజులకు ఐదారు కోట్లు ఖర్చు పెడుతుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ డెవలప్ చేయొచ్చని తెలిపింది.