- గత పదేళ్ల సంస్కరణలతో బ్యాంకింగ్ సెక్టార్ రూపురేఖలు మారాయి
- బ్యాంకుల క్యాపిటల్ నిల్వలు పెరిగాయి: ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి
న్యూఢిల్లీ: గ్లోబల్‌గా పరిస్థితులు బాగోలేకున్నా, మన బ్యాంకింగ్ సెక్టార్ బలంగా ఎస్‌బీఐ చైర్మన్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు (సీఎస్) శెట్టి దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పేర్కొన్నారు.
గత దశాబ్దంలో జరిగిన సంస్కరణలు, కఠినమైన నియంత్రణలు, అసెట్ క్వాలిటీ రివ్యూలు, రీక్యాపిటలైజేషన్ వంటివి బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను బలపరిచాయని తెలిపారు. బ్యాంకుల దగ్గర క్యాపిటల్ నిల్వలు పెరిగాయని, ఎలాంటి షాక్స్ ఉన్నా బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొగలదని వివరించారు.
శెట్టి మాట్లాడుతూ, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, వాణిజ్య అంతరాయాలు, టారిఫ్ సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఒత్తిడి తెస్తున్నాయని, కానీ ఆర్థిక క్రమశిక్షణ, లిక్విడిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులు ఈ ప్రభావాన్ని తగ్గించాయని చెప్పారు. కాగా, ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం భారత జీడీపీ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5శాతం వద్ద నిలుస్తుంది.
ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్, 2026–27లో కూడా బలమైన వృద్ధి కొనసాగుతుంది. ‘‘గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్‌లో చాలా మార్పులు వచ్చాయి. రిస్క్ మేనేజ్‌మెంట్ మెరుగుపడింది. ఆర్‌బీఐ నియంత్రణలు పెరిగాయి. వీటితో బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉంది”అని శెట్టి గుర్తుచేశారు.
