అక్టోబర్ 1నుంచి SBI కొత్త రూల్స్

అక్టోబర్ 1నుంచి SBI కొత్త రూల్స్

స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(SBI) తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఖాతాల్లో మినిమం బాలెన్స్‌కు సంబంధించి పరిమితిపై ఊరటనిచ్చినా, సర్వీసు చార్జీల వసూలు ఉంటుందని చెప్పింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని బ్రాంచుల్లో ఖాతాదారులు నెలకు మినిమమ్ బ్యాలెన్స్ రూ.3,000 ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం రూ.5వేలు ఉన్న పరిమితిని రూ.2వేలకు తగ్గిస్తూ  నిర్ణయం తీసుకుంది. సెమీ అర్బన్‌ ఖాతాల్లో రూ. 2వేలు కనీస నిల్వ ఉండాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాల విషయానికి వస్తే ఈ పరిమితిని రూ.1000గా ఉంచింది.

బ్యాంక్ ఖాతాలో నెలవారీ మినిమమ్ బ్యాలెన్స్ రూ.3000 ఉండకపోతే వినియోగదారుడికి సర్వీసు చార్జీల వసూలు తప్పదు .  రూ.3 వేల పరిమితి గల ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ 50 శాతం తగ్గితే అంటే  రూ.1500 ఉంటే అప్పుడు రూ.10. అదే అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్ 50-75 శాతం  కన్నా తక్కువగా ఉంటేరూ.12. 75 శాతానికి పైగా తగ్గితే రూ.15 పెనాల్టీ చెల్లించాలి. దీనికి అదనంగా GST కూడా చెల్లించాలి.  ఈ పెనాల్టీ శాతం అన్ని  ఖాతాలకు వర్తిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం సేవింగ్‌ ఖాతాలో నెలకు బ్యాంకుల్లో నేరుగా నగదు డిపాజిట్ కేవలం మూడుసార్లు మాత్రమే చేయాలి. ఆ తర్వాత చేసిన ప్రతి సారీ ఛార్జీ వసూలు చేస్తారు. కనీస మొత్తం రూ.100లు డిపాజిట్  చేసినా  రూ. 50 ఛార్జ్  చెల్లించాల్సిందే. దీనికి GST అదనం. అలాగే నాన్‌ హోం బ్రాంచిలలో నగదు డిపాజిట్లకు గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు. నెలకు సగటున 25వేల రూపాయల బాలెన్స్‌ ఉంచే ఖాతాదారుడు నెలకు  రెండు సార్లు ఫ్రీగా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం. అదే రూ. 25-50 వేలు అయితే 10 సార్లు… రూ. 50- లక్ష మధ్య అయితే 15 సార్లు ఉచితం.  ఈ పరిమితి మించితే రూ.50 ప్లస్‌ GSTవసూలు చేస్తారు. నెలకు సగటున లక్ష రూపాయలకు పైన ఖాతాలో ఉంచితే ఈ సదుపాయం పూర్తిగా ఫ్రీ.  పట్టణాల్లో ATM ట్రాన్సాక్షన్స్ సంఖ్య పెరగనుంది. మెట్రో నగరాల్లో ఈ ట్రాన్సాక్షన్ల సంఖ్య నెలకు 10కి పెరగనున్నాయి. నాన్ మెట్రో ప్రాంతాల్లో ఎలాంటి ఛార్జీలు లేకుండా SBI ATMలలో 12 లావాదేవీలు నిర్వహించవచ్చు.  ఇతర బ్యాంకుల ATM కార్డులకు 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఉచితం.