SBIకి గ్లోబల్ ఫైనాన్స్ అవార్డులు

SBIకి గ్లోబల్ ఫైనాన్స్ అవార్డులు

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) న్యూయార్క్ ఆధారిత గ్లోబల్ ఫైనాన్స్ నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. వరల్డ్ బ్యాంక్ / ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో వీటిని అందజేశారు. 'వరల్డ్​ బెస్ట్​ కన్జూమర్ ​బ్యాంక్​2025', 'భారతదేశంలో ఉత్తమ బ్యాంక్ 2025' అనే రెండు టైటిల్స్​ను గెలుచుకుంది. ఈ అవార్డులు తమ కస్టమర్లకు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ అనుభవాలను అందించడానికి చేస్తున్న కృషికి గుర్తింపు అని ఎస్​బీఐ పేర్కొంది. 

ఎస్​బీఐ చైర్మన్ సీఎస్​ శెట్టి మాట్లాడుతూ, 52 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని, రోజుకు 65 వేలు కొత్త కస్టమర్లను చేర్చుకుంటున్నామని చెప్పారు.  ఎస్​బీఐ రెండు ప్రతిష్టాత్మక టైటిళ్లను అందుకున్నందుకు గర్వంగా ఉందంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్​లో రాశారు.