Good News : SBIలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Good News : SBIలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 టీఎఫ్ఓలను భర్తీ చేయనున్నారు.  ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 7 నుంచి  ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 27కు చివరి తేదీ. sbi.co.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ కోసం సూచించిన ప్రదేశాలు హైదరాబాద్, కోల్ కత్తా. అయితే ఎంపికైన అభ్యర్థులను దేశంలో ఎక్కడైనా నియమించవచ్చని బ్యాంక్ స్పష్టం చేసింది.

ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే, ఐఐబీఎఫ్ ద్వారా ఫారెక్స్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. సర్టిఫికెట్ ఫర్ డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్స్ (CDCS) సర్టిఫికేషన్ లేదా సర్టిఫికెట్ ఇన్ ట్రేడ్ ఫైనాన్స్ లేదా సర్టిఫికెట్ ఇన్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి: 2023 డిసెంబర్ 31 నాటికి 23 నుండి 32 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియలో, మొదట అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తరువాత, వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. షార్ట్ లిస్ట్ చేయడానికి అవసరమైన ప్రమాణాలను నిర్ణయించడానికి బ్యాంక్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ తరువాత, తగిన సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. 

ఇంటర్వ్యూ రౌండ్లో 100 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికకు మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు కటాఫ్ మార్కులు సాధిస్తే వారి వయసును బట్టి ర్యాంకులు ఇస్తామని బ్యాంక్ తెలిపింది.