హోమ్‌‌లోన్‌‌ వడ్డీ రేట్లు భారీగా తగ్గించిన ఎస్‌బీఐ

హోమ్‌‌లోన్‌‌ వడ్డీ రేట్లు భారీగా తగ్గించిన ఎస్‌బీఐ
  • హోమ్‌‌ లోన్‌‌వడ్డీ  6.7 శాతం!
  • 10 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఎస్​బీఐ

ముంబై: హోమ్‌‌ లోన్స్‌‌పై  వడ్డీ రేటును ఎస్‌‌బీఐ10 బేసిస్‌‌ పాయింట్లు తగ్గించింది. దీంతో 6.70 శాతం వడ్డీ రేటుకే బ్యాంక్‌‌  నుంచి  హోమ్‌‌ లోన్‌‌ పొందొచ్చు. లోన్‌‌ అమౌంట్‌‌, కస్టమర్‌‌‌‌ సిబిల్‌‌ స్కోర్‌‌‌‌ను బట్టి బారోవర్లు ఈ ఆఫర్‌‌‌‌కు ఎలిజిబుల్‌‌ అవుతారు. ఈ నెల 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని  బ్యాంక్ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. లోన్‌‌ అమౌంట్‌‌ రూ. 75 లక్షల వరకు ఉంటే 6.70 శాతం వడ్డీని, రూ. 75 లక్షల నుంచి రూ. ఐదు కోట్లు మధ్యలో ఉంటే 6.75 శాతం వడ్డీని బ్యాంక్ వసూలు చేస్తుంది. మార్చి 31 లోపు లోన్‌‌ పొందేవారు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజును  చెల్లించాల్సిన అవసరం లేదు. యోనో యాప్ ద్వారా హోమ్‌‌లోన్‌‌కు అప్లయ్‌‌ చేసేవారు అదనంగా వడ్డీ రేటులో ఐదు బేసిస్ పాయింట్లు రాయితీ పొందొచ్చు. విమెన్ బారోవర్లకు వడ్డీ రేటులో  ఐదు బేసిస్ పాయింట్లను స్పెషల్‌‌ రాయితీగా ఇస్తోంది.