SBI ఖాతాదారులకు శుభవార్త

SBI ఖాతాదారులకు శుభవార్త

ఏటీఎం కార్డు  లావాదేవీలపై సర్వీసు చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ. దీంతో ఎన్నిసార్లయినా ప్రజలు ఏటీఎంల నుంచి నగదును విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది.   కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పింది. కేవలం ఎస్పీఐ ఏటీఎంల నుండి మాత్రమే కాకుండా వేరే బ్యాంకు ఏటీఎంలనుంచి కూడా మనీ విత్ డ్రా చేసినా చార్జీలు ఉండవని తెలిపింది ఎస్పీఐ బ్యాంకు. ఈ వెసులు బాటు జూన్ 30వ తేదీ వరకు ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది ఎస్బీఐ బ్యాంకు. కరోనా విలయతాండవం చేస్తున్న సందర్భంగా ఈ నిర్ణయం ప్రజలకు మేలు చేస్తుందని బావిస్తున్నట్లు తెలిపారు.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గురువారం సాయంత్రం వరకు దేశంలో 12వేల 759 కేసులు నమోదు కాగా 1515 మంది కోలుకోగా.. 420మంది మృతిచెందారు.