Electoral Bands Issue : SBI కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్

Electoral Bands Issue : SBI కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్ క్యాష్ చేసిన ప్రతి ఎలక్టోరల్ బాండ వివరాలను వెల్లడించేందుకు జూన్ 30 వరకు సమయాన్ని పొడిగించాలి  కోరుతూ  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBi) చేసిన దరఖాస్తును సవాల్ చేస్తూ ఓ  NGO  ల సంఘం సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ ను దాఖలు చేసింది. ఎన్జీవో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఏడీఆర్) తరపు కోర్టుకు హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషన్ .. ఈ కేసులో ఎస్ బీఐ పై కోర్డు ధిక్కార చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మార్చి 11 న ఎస్ బీఐ పిటిషన్ విచారించే అవకాశం ఉన్నందున ధిక్కార దరఖాస్తును కూడా కలిపి విచారించాలని భూషణ్ కోర్టును కోరారు. 

ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో.. మార్చి6లోగా ఎన్నికల కమిషన్ ( EC) కి వివరాలను అందించాలని ఎస్ బీఐని ఆదేశించింది. అయితే ఎలక్టోరల్ బాండ్ వివరాలను వెల్లడించేందుకు జూన్ 30 వరకు గడువును పొడిగించాలని కోరుతూ మార్చి 4న ఎస్ బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి మార్చి 11న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 
ఏంటీ ఎలక్టోరల్ బాండ్స్.. 

ఎలక్టోరల్ బాండ అంటే భారతదేశంలోని రాజకీయ పార్టీలకునిధులు సమకూర్చే విధానం.. ఈ ఎలక్టోరల్ బాండ పథకం 2017-18 కేంద్ర బడ్జెట్ సమయంలో ఫైనాన్స్ బిల్లు, 2017లో ప్రవేశపెట్టబడింది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15, 2024న సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటర్ల సమాచార హక్కును ఉల్లంఘిస్తున్నందున ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. 

ALSO READ :- ఏఐపై కేంద్రం భారీగా పెట్టుబడులు