ఏఐపై కేంద్రం భారీగా పెట్టుబడులు

ఏఐపై కేంద్రం భారీగా పెట్టుబడులు

భారత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం ప్రధాని అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఏఐ రంగంలో రూ.10,372కోట్లు పెట్టుబడి పెట్టడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏఐ మిషన్‌ ఏర్పాటు చేసి, స్టార్టప్‌ల అవసరాలను తీర్చడానికి, యువతకు ఉద్యోగాలు కల్పించడానికి  దాదాపు10,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (GPU) నెలకొల్పుతామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.  మల్టిపుల్ డేటాతో వ్యవసాయం, ఆరోగ్యం రంగాల్లో సహాయపడే ఏఐ ఇన్నొవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

ALSO READ :- Dil Raju :ఎల్లమ్మ వచ్చేస్తోంది..బలగం వేణు, నాని కాంబో ఫిక్స్

అలాగే ఉజ్వల యోజన లబ్ధిదారులకు 300రూపాయల సబ్సిడీ 2025 మార్చి 31వరకు పొడింగించింది కేంద్రం. దీనికోసం 12వేల కోట్ల రూపాయలు ఖర్చవతోందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. 2024-25 సీజన్ కు ముడి జూట్ కనీస మద్దతు ధర క్వింటాల్ కు 5వేల 335గా కేంద్ర నిర్ణయించింది. గతంతో పోల్చితే 285 రూపాయలు పెరిగిందని తెలిపారు. 10వేల కోట్ల నిధులతో ఇండియన్ ఏఐ మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.