Delhi liquor scam case: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను కొట్టేసిన సుప్రీం

Delhi liquor scam case: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను  కొట్టేసిన సుప్రీం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే ఎదురైంది. లిక్కర్ స్కాంలో ఆయనకు బెయిల్ నిరాకరించింది సుప్రీం కోర్టు.  పిటిషన్ పై గతంలో వాదనలు ముగియటంతో అక్టోబర్ 17 న  తీర్పును రిజర్వ్ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఇవాళ బెయిల్ నిరాకరిస్తూ తీర్పు చెప్పింది సుప్రీం. లిక్కర్ స్కాంలో అరెస్టై 8 నెలలుగా మనీష్ సిసోడియా జైల్లో ఉంటున్నారు.

బెయిల్ తిరస్కరణతో  మనీష్ సిసోడియా మరో ఆరు నెలల పాటు జైలులోనే ఉండనున్నారు. ఈ కేసులో రూ., 338 కోట్లు  చేతులు మారినట్లు ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది.  6-నుంచి 8 నెలల్లో విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది.

విచారణ నెమ్మదిగా సాగితే సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.