
హజ్, ఉమ్రా యాత్రలకు సంబంధించిన సేవలందించే ప్రైవేటు టూర్ ఆపరేటర్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జీఎస్టీ మినహాయింపు కోరుతూ ‘ఆల్ ఇండియా హజ్ అండ్ ఉమ్రా టూర్ ఆర్గనైజర్ అసోసియేషన్’, ఇతర టూర్ ఆపరేటర్లు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్ నేతృత్వంలోని న్యాయమూర్తుల బెంచ్ ఈ పిటిషన్లను డిస్మిస్ చేసింది. మినహాయింపులు, వివక్ష అనే రెండు అంశాల ప్రాతిపదికన ఈ పిటిషన్లను డిస్మిస్ చేశామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, రాజ్యాంగంలోని 245వ ఆర్టికల్ ప్రకారం విదేశీ యాత్రలకు పన్ను చట్టాలు వర్తించవని పిటిషన్ లో పేర్కొన్నారు.