
- తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని.. పునఃసమీక్షించాలని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని 2004లో కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు ఎందుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ప్రశ్నించింది. వర్గీకరణ అంశంలో మోదీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించింది.
శుక్రవారం లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ భవన్లో జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు సరికాదని.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసంతృప్తిని మిగిల్చిందని అన్నారు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై పిటిషన్ వేస్తామన్నారు. 29 రాష్ట్రాల నుంచి తీర్మానాలు, పార్లమెంటు ఆమోదం లేకుండా వర్గీకరణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.