సబ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్ నిధులు... దారి మళ్లిస్తే చర్యలు తప్పవు

సబ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్ నిధులు... దారి మళ్లిస్తే చర్యలు తప్పవు

నల్గొండ, వెలుగు : దళితులు, గిరిజనుల అభివృద్ధి కోసం కేటాయించిన సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్ నిధులను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లోని ఉదయాదిత్య భవన్‌‌‌‌‌‌‌‌లో కమిషన్ సభ్యులతో కలిసి ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు, దాడులు, రిజర్వేషన్ల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు తప్పనిసరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఆదేశించారు. 

మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయని, వీటిపై తక్షణమే విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల కేసులకు సంబంధించి బాధితులకు అందాల్సిన రూ. 1.89 కోట్ల పరిహారాన్ని త్వరగా విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. 

సమావేశంలో కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కె. లక్ష్మీనారాయణ, కలెక్టర్ జె. శ్రీనివాస్, ఇన్ చార్జి అడిషనల్ కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాచర్లకు వెళ్తున్న బక్కి వెంకటయ్యకు కొండమల్లేపల్లిలో స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.